Home  »  TV News  »  Jayam serial : రుద్ర గొప్పతనం తెలుసుకున్న శకుంతల.. ఇషిక కుట్రలు పారుతాయా?

Updated : Apr 23, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -250 లో....లక్ష్మిని తీసుకొని సుధా సూపర్ మార్కెట్ కి వస్తుంది‌‌. అమ్మ మీకు కూతురు ఉందా అని లక్ష్మీ అడుగుతుంది. ఉండేది ఉంటే నీ కూతురు గంగ అంత ఉండేది అని సుధా బాధపడుతుంది. బాధపడకండి అమ్మ మీ అమ్మయిని ఆ దేవుడు మీ దగ్గరికి చేరుస్తాడని లక్ష్మీ అనగానే నీ నోటి వాక్కు నిజం అవ్వాలని సుధా అంటుంది. గంగని చూస్తే ఎందుకో మనసుకి నిండుగా అనిపిస్తుందని సుధా అంటుంది. అప్పుడే పెద్దసారు సూపర్ మార్కెట్ కి వస్తాడు. ఏంటి మావయ్య ఇలా వచ్చారని పెద్దసారుని ప్రమీల అడుగుతుంది. ఇంట్లో ఉంటే బోరింగ్ గా ఉందని, అందుకే వచ్చానని పెద్దసారు అంటాడు. అప్పుడే కార్తీక్ వస్తాడు. అతనితో సరదాగా మాట్లాడతాడు.

లోపల స్టాక్ చూసి వద్దామని మక్కమ్ తో కలిసి పెద్దసారు లోపలికి వెళ్తాడు. సుధా సరుకులు చూస్తూ వస్తుంది. పెద్దసారుని సుధా చూసి షాక్ అవుతుంది‌. వెంటనే అక్కడ నుండి వెళ్లిపోవాలని వెళ్తుంటే ఏదో బాక్స్ అడ్డుపడి అందులో సరుకు మొత్తం పోతుంది. సుధాని వెనకాల నుండి పెద్దసారు చూసి.. పర్లేదు అమ్మ మా మేనేజర్ చూసుకుంటాడు వెళ్ళండి అని పెద్దసారు అనగానే సుధా వెళ్తుంది. పెద్దసారు దగ్గరికి లక్ష్మీ వచ్చి మాట్లాడుతుంది. బయటకు వెళ్లిన సుధా తన అన్నయ్యని చూసి కూడా మాట్లాడలేదని ఏడుస్తుంది. మరొకవైపు గంగ, రుద్ర, రంగా ఇంట్లోకి సరదాగా మాట్లాడుకుంటూ వస్తారు. అది వీరు చూసి.‌. చూసారా అత్తయ్య అందరికి పనులు అప్పగించి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని వీరు అనగానే.... శకుంతల అందరిని పిలిచి వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కుంటుంది. ఇంట్లో అందరు ఏదో ఒక పనులు చేస్తూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావని రుద్రని శకుంతల అడుగుతుంది. మా బావ ఏం చేస్తున్నాడో నేను చెప్తానని రంగా అంటాడు‌ సూర్యకి కాంట్రాక్టు రావడానికి.... రాఘవ మావయ్య సింగపూర్ లో బిజీ అవ్వడానికి...  వంశీ బైక్ రేసింగ్ లో దొరికితే కాలేజీ వాళ్ళు టీసీ ఇస్తామని అంటే వద్దని ఆపింది రుద్ర బావ... ప్రమీల సిస్టర్ సక్సెస్ ఫుల్ గా సూపర్ మార్కెట్ ని రన్ చెయ్యడానికి కారణం మా బావ.. స్నేహని ఎవరో ఏడిపించారని వాళ్లకి టీసీ ఇచ్చేలా చేసింది రుద్ర బావ.... అంత ఎందుకు నువ్వు వెంచర్ తీసుకున్నావ్ వీరు ఆ వెంచర్ ఇచ్చిన అతని అబ్బాయికి బావ అకాడమీలో సీట్ ఇచ్చాడు.. ఇవ్వన్నీ ఎవరికి చెప్పుకోకుండా ఇంట్లో వాళ్ళు చేసే ప్రతీ దాంట్లో బావ ఉన్నాడని రంగా అనగానే శకుంతల సైలెంట్ గా వెళ్లిపోతుంది. 

ఆ తర్వాత ఇషిక, వీరు మాట్లాడుకుంటుంటే అప్పుడే పెద్దసారు వస్తాడు. రుద్ర అంటే నీకు కోపం ఉందా బిజినెస్ చేసుకోమన్నాడని కోపమా.. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు శకుంతల మనసు ఎవరు చెప్తే అదే నిజమని అనుకుంటుంది. ఎందుకు అంటున్నానో అర్ధం చేసుకోమని పెద్దసారు అంటాడు. ఇషిక ఇప్పటి వరకు నీ విషయంలో జోక్యం చేసుకోలేదని పెద్దసారు అనగానే ఇషిక భయపడుతుంది. తరువాయి భాగంలో స్నేహ పార్టీకి వెళ్లి రాలేదని ఇందుమతి వాళ్ళు టెన్షన్ పడుతారు. ఆ విషయం ఇషిక విని శకుంతలకి తెలిసేలా చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.